KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కే. తారక రామారావుకు (కేటీఆర్) మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్‌స్టన్ పట్టణంలో ఉన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19, 2025న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (KIBC-2025) లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రత్యేకంగా లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. Railway Ticket: రైల్వే కౌంటర్…
Datathon Conference on ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించనున్నాయి. బుధవారం (జులై 10) ‘డేటాథాన్’ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ఓ ప్రకటలో తెలిపింది. వచ్చే సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్‌ఓజోన్‌టెల్, డిజిక్వాంట, టెక్‌వేదిక సంస్థలు…
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
మెటావర్స్..! టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రసెన్స్ లేకపోయినా… అవతార్‌ల రూపంలో లైవ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్…