Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్‌ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్ లోనే డప్పుకొట్టుకోవడం అంత బాగా అనిపించటం లేదు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘ఓన్ ప్రొడక్షన్ ఈవెంట్లకు రావద్దు అన్నా ఇంకా’ అని కొందరు ట్వీట్ చేస్తే దానిని మరింతగా రీట్వీట్స్ చేస్తూ బన్నీ ప్రొడక్షన్ స్టాఫ్ ని, వ్యక్తిగత సిబ్బందిని ఎక్కి తొక్కేస్తున్నారు. అల్లుఅర్జున్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బాకా వూదే వారిని అయితే ఆటాడుకుంటున్నారు. ‘బన్నీ అయినా బయట ఎలా అనుకుంటున్నారో, ప్రతిసారి ట్రోల్స్‌కు గురవుతూనే ఉన్నాడు’ ఈ విషయం గమనించుకోవాలి కదా అని కొందరు, ఎవరైనా పరువు తీసుకోవద్దని చెప్పండని ఇంకొందరు ట్వీటారు.
Read Also: Vishal: పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఓటు మాత్రం అతనికే వేస్తాను
మొన్నటికి మొన్న ‘ఊర్వశివో రాక్షసివో’, తాజాగా ’18 పేజెస్’ ఈవెంట్లలో బన్నీ ‘పుష్ప2’ గురించి ప్రస్తావనలు రావటం, దానికి అల్లు అర్జున్ సమాధానం ఇవ్వాల్సి రావటం ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తూ ట్రోల్స్‌కు కారణమవుతోంది. గ్యాప్ తర్వాత ఇటీవలే ‘పుష్ప 2’ షూటింగ్ ప్రారంభమైంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైనే ఉంది. ఇలాంటి టైమ్‌లో తరచుగా పబ్లిక్‌లో సినిమాను హైలైట్ చేయడమంటే ట్రోలర్స్‌ను ఆహ్వానించినట్లే అన్నది బన్నీ డై హార్డ్ ఫ్యాన్స్ అభిప్రాయం. మరి వారి అభ్యర్దనను బన్నీ అండ్ కో ఎంత వరకూ గౌరవిస్తుందో చూద్దాం.
Own production events ki ravoddu anna inka @alluarjun 😔🙏🏻
— Allu Arjun Fan™ (@IamVenkateshRam) December 19, 2022