Penukonda: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా జరుగనుంది. ఈ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో పెనుకొండ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఈ సైకిల్ యాత్రను మంత్రి సవిత శ్రీమతి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఆమె స్వయంగా సైకిల్ తొక్కుతూ 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ మొత్తం కార్యకర్తలు ఈ సైకిల్…
బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ మాచాని సోమనాథ్ సైకిల్ యాత్రను చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు టూ అసెంబ్లీ సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే పాతూరు-గుండుగొలను హైవే మధ్యలో సైకిల్ యాత్ర చేస్తున్న రామానాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ ప్రమాదవశాత్తూ సైకిల్ నుంచి జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా నిమ్మల సైకిల్ నుంచి…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు…