South Central Railway: రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చిరికలు జారీ చేసింది. కదులుతున్న ట్రైన్ లో ఎక్కిన, దిగిన భారీ జరిమానా విధించడమే కాకుండా.. 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు. కాగా.. రైలు కదులుతున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎక్కుతూ దిగుతుంటారు. దీంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. రైళ్ల కింద పడి కాలు, చేతులు విరగడమే కాకుండా నరకయాతన ఏదుర్కొన వలసిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఈ నేపథ్యంలో రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని.. భద్రత విషయంలో రైల్వే శాఖకు సహకరించాలని ఓ ప్రకటనలో కోరింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రైళ్లలో ఎక్కినా, దిగినా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రైలు బయలు దేరిన సమయంలో, స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, రైలు ఎక్కవద్దని, దిగడానికి కూడా ప్రయత్నించవద్దని చెప్పారు.
Read also: RC 16 Movie : గ్రాండ్ గా ప్రారంభమైన RC16 మూవీ.. వైరల్ అవుతున్న వీడియోలు..
ఇక నిషేధిత ప్రాంతం నుంచి రైళ్లలోకి వెళ్లవద్దని చెప్పారు. పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్ వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలన్నారు. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ట్రాక్‌ల దగ్గర నడిచేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని చెప్పారు. రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంపై నిషేధం ఉందన్నారు. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం, రైల్వే ట్రాక్‌పై అతిక్రమించడం చట్టరీత్యా నేరం, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొనడంతో.. రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. కదులుతున్న రైలులో ప్రయాణికులు హడావుడి చేస్తూ ఎక్కుగున్నప్పుడు కిందపడిన వారిని పోలీసులే కాపాడిన దాఖలాలు కూడా వున్నాయని వెల్లడించింది.
ICC – Hasaranga: హసరంగకు ఐసీసీ దెబ్బ మాములుగా లేదుగా..!