Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండిసంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. పాలనా యంత్రాంగం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను ప్రకటించారు. ఏపీ బీజేపీ నేత సత్య కుమార్ కు జాతీయ కార్య దర్శిగా ఛాన్స్ ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం లేదా జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా పంపడం ద్వారా కేంద్ర నాయకత్వం బండి సంజయ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఒకరికి ఒకే పదవి.. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Krishna Water Dispute: కృష్ణా జలాలపై మళ్లీ రగడ.. ఏపీకి తెలంగాణ స్ట్రాంగ్ కౌంటర్
- Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
- Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
-
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
-
UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!