Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
2021-22 బడ్జెట్‌లో మహిళాగ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు. 2022-23 బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని లేఖలో తెలిపారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయకసంఘాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో అర కొరగా నిధులు విధిలిస్తూ మహిళల సాధికారితపట్ల చిన్నచూపు చూడటం గర్హనీయమన్నారు. మహిళల పట్ల, మహిళాసాధికారత పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడాలని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలను విడుదల చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ తెలంగాణశాఖ తరుపున కోరుతున్నామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Polavaram Flood Victims: విలీన మండలాల్లో హోరెత్తిన పోలవరం నిర్వాసితుల ఆందోళన.. వరద నీటిలో నిరసన
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- Dwakra
- letter
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!