Tomb of Nadda: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ మునుగోడు ఉప ఎన్నికలు.. అలాగైనా ఎన్నికల్లో గెలిచితీరాలని పోటా పోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆప్రాంతంలో వెలస్తున్న పోస్టుర్ల కలకలం రేపుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మునుగోడులో తమ పార్టీ జెండాను ఎగవేయాలని గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై టార్గెట్ చేశారు. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు మరచారంటూ గుర్తు తెలియని వ్యక్తులు నడ్డాకు సమాధి కట్టారు. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపగా.. ఇప్పుడు నడ్డాకు ఏకంగా సమాధికట్టిన తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read also: To Get Profits in Stock Markets: స్లో అండ్ స్టడీ.. బ్రింగ్స్ ది ప్రాఫిట్స్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి గతంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసింది అని బిజెపి నేతలు ప్రచారంలో పేర్కొంటున్న నేపథ్యంలో తాజాగా.. ప్రతిపాదిత ఫ్లోరైడ్ రీసర్చ్ సెంటర్ వద్ద బిజెపి జాతీయ అధ్యక్షుడుకీ సమాధి కట్టి వినూత్న నిరసనకు దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. కేంద్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్తసిని రూపుమాపడానికి ఫ్లోరైడ్ రీసెర్చ్ మంజూరు చేసిదని. కానీ దశాబ్దాలు గడుస్తున్న నిధులు విడుదల కాలేదని, రీసెర్చ్ సెంటర్ మనగడలోకి రాకపోవడం.. కార్యకలాపాలు అసలు ప్రారంభమే కాకపోవడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు సమాధి కట్టి అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో.. కలకలం రేపుతుంది.
Gym Trainer : హార్ట్ ఎటాక్ తో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన జిమ్ ట్రైనర్