NTV Telugu Site icon

JP Nadda: దక్షిణాదిపై ఫోకస్‌.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..

Jp Nadda

Jp Nadda

భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.. అందులో తెలంగాణపై మరింత ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఎవరికి వీలైనప్పుడల్లా వారు వస్తూనే ఉన్నారు.. మునుగోడు బై పోల్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కూడా జేపీ నడ్డా రావాల్సి ఉన్నా.. చివరి క్షణాల్లో తన పర్యటన రద్దుచేసుకున్న విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు బీజేపీ జాతీయ చీఫ్‌.. ఈ నెల 16వ తేదీన తెలంగాణకి రాబోతున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన 5వ విడత ముగింపు సభకు హాజరుకాబోతున్నారు నడ్డా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు..

Read Also: Oil Prices Rise: భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధర.. మళ్లీ పెట్రో మంట తప్పదా..?

ఇప్పటి వరకు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది బీజేపీ అధినాయకత్వం.. గుజరాత్ ఎన్నికలు ముగిసాయి.. ఇవాళ తుదివిడత పోలింగ్‌ జరుగుతోంది.. ఇక, గుజరాత్‌లో హడావుడి చేయాల్సిన పని తగ్గడంతో ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్‌ పెట్టింది కమలం పార్టీ అధిష్టాం.. ఇక, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలతో జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశంకాబోతున్నారు.. దక్షిణాదిపై పట్టుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది పరిస్థితి.. ఓవైపు సీబీఐ, ఈడీ, ఐటీలు దూకుడు చూపిస్తుంటే.. మరోవైపు సిట్‌ తానేం తక్కువా? అనే రీతిలో దూకుడు పెంచింది.. ఈ నేపథ్యంలో.. మరోసారి తెలంగాణకు రాబోతున్న జేపీ నడ్డా.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.