JP Nadda: దక్షిణాదిపై ఫోకస్.. మరోసారి తెలంగాణకు జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.. అందులో తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఎవరికి వీలైనప్పుడల్లా వారు వస్తూనే ఉన్నారు.. మునుగోడు బై పోల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కూడా జేపీ నడ్డా రావాల్సి ఉన్నా.. చివరి క్షణాల్లో తన పర్యటన రద్దుచేసుకున్న విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు బీజేపీ జాతీయ చీఫ్.. ఈ నెల 16వ తేదీన తెలంగాణకి రాబోతున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ముగింపు సభకు హాజరుకాబోతున్నారు నడ్డా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు..
Read Also: Oil Prices Rise: భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర.. మళ్లీ పెట్రో మంట తప్పదా..?
Also Read
ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది బీజేపీ అధినాయకత్వం.. గుజరాత్ ఎన్నికలు ముగిసాయి.. ఇవాళ తుదివిడత పోలింగ్ జరుగుతోంది.. ఇక, గుజరాత్లో హడావుడి చేయాల్సిన పని తగ్గడంతో ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ అధిష్టాం.. ఇక, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలతో జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశంకాబోతున్నారు.. దక్షిణాదిపై పట్టుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది పరిస్థితి.. ఓవైపు సీబీఐ, ఈడీ, ఐటీలు దూకుడు చూపిస్తుంటే.. మరోవైపు సిట్ తానేం తక్కువా? అనే రీతిలో దూకుడు పెంచింది.. ఈ నేపథ్యంలో.. మరోసారి తెలంగాణకు రాబోతున్న జేపీ నడ్డా.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!