Site icon NTV Telugu

Dr Lakshman: మోడీ వచ్చినప్పుడే.. సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుంది.. లక్ష్మణ్ ఫైర్

Dr Lakshman

Dr Lakshman

Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీరు బిర్యానీ కోసం కాకుండా మోడీ గారి ప్రసంగం కోసం ప్రజలు వచ్చి విజయవంతం చేశారని, ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కేటీఆర్ కి దిక్కు దొచడం లేదని, కల్వకుంట్ల కుటుంబం బిత్తర పోయి గాయి గత్తర చేస్తున్నారని అన్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలి పోయి తప్పి మతి భ్రమించి ప్రేలాపనలు చేశారని అన్నారు. ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన అంతం కావాలని అంటే తెలంగాణ మా కుటుంబం అని కేటీఆర్ కామెడీ చేశారని అన్నారు. తెలంగాణ మీ కుటుంబం అయితే దళిత సీఎం ను ఎందుకు చెయ్యలేదు దళితుడు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. సీఎం, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ, st, మహిళ కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమ కారులు మీ కుటుంబం కాదా? మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు..వాళ్ళు మీ కుటుంబం కాదా? పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారుల మీదకు ఉసిగొల్పి గిరిజనుల మీద దాడులు వాళ్ళు మీ కుటుంబం కాదా? నిరుద్యోగులు మీ కుటుంబ సభ్యులు కాదా? బీసీ బందు ఎస్టీ బంధు అడిగితే ఇవ్వలేదు వాళ్ళు మీ కుటుంబం కాదా? Tspsc నిర్వహించకుండా అవినీతి అక్రమాల చేసిన వారిని కాపాడుతున్నారు 30 లక్షల విద్యార్థులు మీ కుటుంబం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. 6 వేల నుంచి 40 వేల కోట్ల మద్యం ఆదాయం పెంచుకున్నారని తెలిపారు. 2000 ఇచ్చి పది వేలు కొట్టేస్తున్నరని అన్నారు. అవినీతి, అమ్యమ్యలు తప్ప ఏముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. PM వస్తే మమత బెనర్జీ లాంటి వాళ్ళు కూడా స్వాగతం పలికితే సీఎం కెసీఆర్ రాడు అంటూ మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కు కెసిఆర్ తలవంపులు తెస్తున్నాడని అన్నారు. 9 ఎండ్లలో 9 లక్షల కోట్లు అభివృద్ధి కి pm నిధులు ఇస్తే కబోది లాగా సీఎం కేసీఆర్ వ్యవహారం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పసుపు బోర్డు ద్వారా తెలంగాణ ప్రజలకు మోడీ ఎంత సాయం చేశారో తెలుసా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కూడా కెసిఆర్ సహించలేక పోతున్నాడు అని మండిపడ్డారు. రాజకీయంగా నష్ట పోతమనే భయం కెసిఆర్ కుటుంబానిది అన్నారు. వన దేవత సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఇస్తే కూడా కెసిఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. కెసిఆర్ భూమి ఇవ్వక ఆలస్యం అయ్యిందన్నారు. మోడీ పట్టుదలతో ములుగులో పెడుతున్నారని అన్నారు. కెసిఆర్ పీఠాలు కదులుతాయన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీ మీకు సినిమా చూపించబోతున్నదన్నారు. మీది కుల, కుటుంబ, అవినీతి పార్టీనే ముమ్మాటికీ.. Bye bye కచరా బాబాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..

Exit mobile version