BJP MLAs: ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLAs: ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇటీవల ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. సమావేశాన్ని బహిష్కరించారు. ఇక సీనియర్లను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసుకునేందుకు అక్బరుద్దీన్‌కు అవకాశం ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. 15 నిమిషాలు ఆగితే హిందువులను చంపేస్తానని చెప్పిన వ్యక్తి నాయకత్వంలో ప్రమాణం చేయనని రాజాసింగ్ తేల్చి చెప్పారు. పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాత చేస్తామని వెల్లడించారు. గడ్డం ప్రసాద్‌ను పూర్తి స్పీకర్‌గా నియమించిన తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బీజేపీ ఎల్పీ నేతను నియమించకుండానే సమావేశాలకు హాజరయ్యారు.
Read also: Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా.. మనసులో మాట బయటపెట్టిన రాజాసింగ్
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
రాజాసింగ్ మాట్లాడుతూ.. అక్బరుద్దిన్ ముందు ప్రమాణం చేయమని చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే లు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటి లతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెoటిలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని అన్నారు.
పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని తన మనసులోని మాటను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బయట పెట్టారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు. గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారు. నిధులు ఇటలీ నుండి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారా చెప్పాలన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8 మంది ఎమ్మెల్యేలను కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. నేను ప్రభుత్వాన్ని కూలగొడతా నని అనలేదన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ లు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా.. మనసులో మాట బయటపెట్టిన రాజాసింగ్
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..