కేసీఆర్ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు : రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక వర్గంలో షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బేగం బజార్ లో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తారు అన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు. రెండేళ్ళ క్రింతం ర్యాలీ తీసిన యువజన సంఘం అద్యక్షుడితో పాటు నాపై కూడా ఎఫ్ఐఆర్ చేసారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న నేపంతో కేసు బుక్ చేసారు. ఈ ఏడాది కూడా ఆగస్ట్ 15 న జాతీయ పతాకం ఎగర వేయడంతో పాటు ర్యాలీకి అనుమతి కోరేందుకు యువకులు వెళ్ళారు. పర్మిషన్ మేం ఇవ్వలేమని.. కమిషనర్ ఇస్తారని వారికి లెటర్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జాతీయ పతాకం ఎగుర వేయాలి అంటే కూడా అనుమతి కావాలి. జాతీయ పథాకాన్ని ఎగర వేయాలంటే కూడా అనుమతి కోరాలనడం ప్రభుత్వంకు, అధికారులకు సిగ్గుచేటూ. అనుమతి కావాలని కోరిన అదికారులు విషం తాగి చనిపోవాలి. ఎందుకంటే మీరు కాని , మీ పూర్వికులు దేశం గురించి ఏమీ చేయలేదు. ఎంతో మంది త్యాగం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. వారి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారో. తెలంగాణ పోలీసు అదికారులు స్వతంత్రం కోసం చనిపోయిన వారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది అని తెలిపారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
అలాగే పోలీసులు ఇంక ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుపుకోమని చెప్పాలి. దేశం పట్ల మీ భావన ఇదేనా..సిగ్గురావాలి. డీజీపీ , కమిషనర్ మీ లోకల్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. ఏ అదికారి ర్యాలీకి అనుమతి ఇవ్వరో, ర్యాలీ తీస్తే జైలుకు పంపిస్తా అనే వారికి సస్పెండ్ చేయాలి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆగస్టు 15న జెండా ఎగర వేసేందుకు ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. రెండేళ్ళుగా కోర్టు చుట్టు తిరుగుతున్నాం.. ఎన్ని కేసులు అయినా ఎదుర్కొంటాం. ఎన్ని కేసులైనా బుక్ చేయండి.. మేం అన్నింటికి తయారై ఉన్నాం అని పేర్కొన్నారు.
- Tags
- bjp mla
- cm kcr
- raja singh
- telangana
- TRS
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!