బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం రేపడం, మైనార్టీలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో.. హైకమాండ్ అతనిపై ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంది. బీజేపీ శాసన సభ పక్ష నేత పదవీ నుంచి కూడా తొలగించింది. మిగతా బాధ్యతలన్నింటి నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్టు హైకమాండ్ స్పష్టం చేసింది.
అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తను వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై సమాధానం ఇస్తానని తెలిపారు.. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపార్టీ తనను వదులుకోదని అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకముందని అన్నారు. రాజాసింగ్ చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాగా.. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేదని.. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటానని స్పష్టం చేశారు.
అటు.. రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. నుపూర్ శర్మ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోను పోలీసులు యూట్యూబ్ నుంచి తొలగించారు. మునవ్వర్ ఫారుఖీ కామెడీ షోను హైదరాబాద్‌లో నిర్వహించకూడదంటూ రాజాసింగ్ చాలారోజుల నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చారు. హిందూ దేవుళ్లను అవమానించిన వ్యక్తిని ఎలా అనుమతి ఇస్తారని, నగరంలో అతని షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. వేదికను తగలబెడతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే.. తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో మునవ్వర్ షో ముగిసింది. అందుకు కౌంటర్‌గానే.. ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ కామెడీ షో పేరుతో ఒక అభ్యంతకరమైన వీడియోని రిలీజ్ చేశారు. పదిన్నర నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, మైనార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది.
అయితే.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు పూర్తి నమ్మకముందని అన్నా వార్తపై తీవ్ర దుమారం రేపుతుంది. బండి సంజయ్ పై తనకు నమ్మకం వుందని చెప్పడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం.. 1998 తర్వాత గాంధీయేత కుటుంబం నుంచి ఛాన్స్