బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం రేపడం, మైనార్టీలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో.. హైకమాండ్ అతనిపై ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంది. బీజేపీ శాసన సభ పక్ష నేత పదవీ నుంచి కూడా తొలగించింది. మిగతా బాధ్యతలన్నింటి నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్టు హైకమాండ్ స్పష్టం చేసింది. అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తను వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై…