Tarun Chug: కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ నీకు బైబై చెప్పే టైం వచ్చిందని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి శత్రువు కుటుంబ రాజకీయాలు, కేసీఆర్ సర్కార్ జంతర్ మంతర్ సర్కార్ అంటూ సెటైర్లు వేశారు. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని మండిపడ్డ ఆయన.. కేసీఆర్ సర్కార్ కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు.. అబద్దపు హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చలేదు.. కానీ, అంబేద్కర్‌ని అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు.. ఈ రోజు నుండి నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇక, 529 రోజులే నీ పాలన అంటూ జోస్యం చెప్పారు.
Read Also: Bheemla Nayak: హిందీలో రీమేక్.. హీరో ఎవరో తెలుసా?
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
సాలు దొర.. సెలవు దొర.. అంటూ వెబ్ డిజిటల్ బోర్డ్ ని ప్రతి చోటా పెడతామన్నారు తరుణ్ చుగ్.. ఇక, బీజేపీ కార్యవర్గ సమావేశాలపై స్పందించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నారు… మోడీ ప్రధాని అయ్యాక ఎప్పుడు కూడా కార్యవర్గ సమావేశాలకు ఇంత సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా ఈనెల 30వ తేదీనే హైదరాబాద్ రాబోతున్నారు. రానున్నారు. మరోవైపు, జులై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.. భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది.
- Tags
- bjp
- cm kcr
- tarun chugh
- telangana
- TRS
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!