Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jithender Reddy: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. పలు కీలక పార్టీలు మారుతున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన తన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి నిన్న (శుక్రవారం) కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన చేతులు కలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన రెండు పదవులు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జూరీ చేసంది. కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపారు. లేఖలో ఆయన పార్టీ మారడానికి గల కారణాలను లేఖలో వివరించారు.
Read also: Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
అయితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండగా.. రాష్ట్రంలో ఆ పార్టీ బలపడి రాజకీయ శక్తిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో నాయకత్వం మారిన తర్వాత బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లకు గాను 8 సీట్లకే పరిమితమైందని అన్నారు. అయితే.. ఇన్నాళ్లూ బీజేపీలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా.. బీజేపీ తన పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినప్పుడు, మహబూబ్ నగర్ స్థానానికి అభ్యర్థిగా డికె అరుణను ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి పోటీ చేయాలని భావించగా, డీకే అరుణపై హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈనేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీ మార్పుపై చర్చించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్టీలో చేరిన వెంటనే.. కేబినెట్ హోదాతో కూడిన పదవులు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించడం గమనార్హం.
RS Praveen Kumar: కవిత అరెస్ట్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!