Bhatti Vikramarka: నేడు ఆదిలాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. బజార్ హత్నూర్ మండలం పీప్రికి వెళ్లనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పిప్పీరి నుంచి భట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈరోజుతో పాదయాత్ర ప్రారంభంకు ఏడాది పూర్తీ చేసుకుంది. ఏడాది పూర్తి అయిన సంధర్భంగా పీప్రికి బట్టి వెళ్లనున్నారు. ఉదయం హెలిప్యాడ్ ద్వారా అక్కడకు చేరుకుని..పలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. చారిత్రాత్మక పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేడు ఏడాది పూర్తి చేసుకుందని భట్టి విక్రమార్క ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చూసిన కష్టాల నుండి ఉద్భవించిన హామీలే నేడు తెలంగాణ ప్రజల ప్రభుత్వంలో ప్రజా పాలన సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజారహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16- 2023న హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది.
Read also: Rc16 : రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా టైటిల్ అది కాదా..మరి?
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్లు, 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700 గ్రామాలకు పైగా 109 రోజుల పాటు అలుపెరగని పాదయాత్ర చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, భరోసా కల్పించింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో ఏడాది పూర్తి సుకుంది. ఈ పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు భట్టి. మనిషి సంకల్పానికి ఏది అడ్డుపడది అని భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఉదాహారణే పట్టు వదలని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అన్నారు. మండుటెండల్లో 1364 కిలోమీటర్లు అలుపెరగని పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పాలన నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛాయుత ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటికి ఏడాది పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
Lok Sabha Election 2024 : దేశంలో ఓటర్లెంతమంది ? తమ ఎంపీని ఫస్ట్ టైం ఎన్నుకునే వాళ్లెందరు ?