Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు.
అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వద్దకు యాదగిరిగుట్ట 108 వాహనం చేరుకుంది.
దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల హెచ్చరిక లేఖ వచ్చినా...అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్...ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనో సంచలనం. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. తాను మచ్చలేని రాజకీయా నాయకుడిని అని చెప్పుకొచ్చారు మాజీమంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20ఏళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న తాను ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేసారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేసారు. తాను అధికారపార్టీలో…