Big Twist in Vaishali Case: రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి పోలీసులకు నిర్వాకం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో ఓయువతిని కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే నవీన్ వైశాలి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. మా వివాహం 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల దేవాలయంలో జరిగింది. బిడిఎస్ వరకు పెళ్లి ఫోటోలు బయటకు రాకూడదని వైశాలి కండిషన్ పెట్టిందని, మేము జనవరి 2021 నుండి ప్రేమలో ఉన్నామని నవీన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ కిడ్నాప్ కథ ట్వీస్ట్ తిరిగింది. వైశాలి కుటుంబ సభ్యులు నాతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు నవీన్. బిడియస్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామంటూ వైశాలి తల్లిదండ్రులు ఇచ్చిన మాటను తప్పారని చెప్పుకొచ్చాడు నవీన్. నా డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగళూరు, గోకర్ణ, గోవా వెళ్ళానని, నేను వైశాలి పేరు మీద వోల్వో, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాప్‌లు రిజిస్టర్ చేయించానని నవీన్ స్పష్టం చేశారు. అక్టోబర్ లో వైశాలి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నవీన్ రెడ్డి తెలిపారు.
Read also:Glaucoma: కంటిచూపు దొంగ ‘గ్లకోమా’.. లక్షణాలు, చికిత్సలు ఇవే..
వైశాలి నా భార్య లవర్ కాదని, పోలీస్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో బాపట్లలో మా వివాహం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు నవీన్ రెడ్డి. తల్లిదండ్రులకు భయపడి వైశాలి వారితోనే ఉంటుందని, వైశాలి తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉందని నవీన్ పేర్కొన్నాడు. తన భార్యను తన వద్దకు పంపించడం లేదనీ సెప్టెంబర్ 30న లీగల్ నోటీసు పంపానని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, నన్ను చంపేందుకు వైశాలి తల్లిదండ్రులు వేరే వారికి సుపారి ఇచ్చారని నవీన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జులై నుండి తల్లిదండ్రులతో వైశాలి ఉంటుందని అన్నాడు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు వైశాలి తల్లిదండ్రులు ధ్వంసం చేశారని పేర్కొన్నాడు. వైశాలి సోదరుడు విదేశాల్లో ఉంటు ఒక ఎన్.అర్.ఐ సంబంధం తీసుకొచ్చాడని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే వైశాలి తల్లిదండ్రులు మాత్రం నవీన్ తో పెళ్లి కాలేదని తన కూతురిని అంటుండటంతో ఈకేసులో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ వెలుగులోకి వస్తున్నాయి.
Read also: KTR is Angry: నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఎందుకు.. అధికారులపై కేటీఆర్ ఫైర్
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన ఈ ఘటన యువతులను కలచివేస్తోంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మన్నెగూడలోని సిరిటౌన్ షిప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైన వైశాలి తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వచ్చి తన కూతురు వైశాలిని కిడ్నాప్ చేశాడని, యువతి ఇంటిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లారని వైశాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందు ఉన్న కారు ధ్వంసమయ్యాయి. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇరుగుపొరుగు వారు, బాలిక తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. నవీన్‌తో వచ్చిన వ్యక్తులు తొలుత ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ నుంచి విజయవాడవైపు పారిపోతుండగా నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, నల్గొండజిల్లా మంచన్‌పల్లి వద్ద వైశాలిని అదుపులోకి తీసుకుని.. వైశాలి, నవీన్ రెడ్డిలను ఒకే చోట విచారిస్తున్నారు. అయితే.. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆదిభట్ల పోలీసులు.
Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్