కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా.. దీని లక్షణాలు బయటకు కనిపించవు.

ఈ వ్యాధికి తొలి లక్షణం పక్కచూపు మందగించడం. అయితే దీన్ని గుర్తించేసరికే వ్యాధి తీవ్రమైపోతుంది.

కంటి నరాల్లో ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు హఠాత్తుగా కన్నునొప్పి రావడం, తలనొప్పి రావడం, చూపు మసకబారడం, కాంతి చుట్టూ వలయాలుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కంట్లో అసౌకర్యం కలగకపోవడం వంటి కారణాల వల్ల గ్లకోమాను చివరి దశ వరకూ గుర్తించలేరు. కొంచెం అప్రమత్తతతో కళ్లను పరీక్షించుకోవాలి. 

గ్లకోమాను నియంత్రించే అవకాశాలు లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వంశపారంపర్యంగా గ్లకోమా వచ్చే అవకాశం ఉన్నందున క్రమం తప్పక కంటి పరీక్షలు చేయించుకోవాలి.

స్టెరాయిడ్స్‌ వాడకం పూర్తిగా తగ్గించాలి. ప్రతీ చిన్న రుగ్మతకు స్టెరాయిడ్‌ చుక్కల మందులు వాడకూడదు.

రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌లను అదుపులో ఉండేలా చూసుకోవాలి. మధుమేహులు చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవాలి.

కళ్లకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు నిప్పురవ్వలు కంట్లో పడకుండా చూసుకోవాలి.

కంట్లో ఒత్తిడి తగ్గేందుకు యోగా, వ్యాయామాలు చేయాలి.