BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో పోలీసుల భారీ ఆపరేషన్ బయటపడింది. తెలుగు రాష్ట్రాలను ఇది షేక్ చేయనుంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం వల వేశారు. ఎమ్మెల్యేల బేరసారాలు బెడిసికొట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ లో పట్టుబడ్డవారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ వున్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండె డ్ గా పట్టుకున్నారు పోలీసులు.. పట్టుబడ్డవారంతా బీజేపీ వారే అని తేలింది.
Also Read
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
కాసేపట్లో పోలీసుల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ఆపరేషన్ లో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు పేర్లు బయటకు వచ్చాయి.బీజేపీ ఆపరేషన్ బెడిసికొట్టింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఫిరాయింపుల కోసం నలుగురు TRS ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు జరిపారు. రూ.15 కోట్ల వరకు నగదు దొరికినట్లు సమాచారం. నలుగురు TRS ఎమ్మెల్యేల్లో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్‌లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. TRS ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.ఫామ్ హౌస్ కి చేరుకున్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఆపరేషన్ ని ఎన్టీవీ బ్రేక్ చేసింది.బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ అంబర్ పేట లో సెలబ్రేషన్స్ హోటల్స్ నిర్వహిస్తున్న నందు అనే వ్యక్తి కీలకంగా మారాడు. నందు ఒక మంత్రికి సన్నిహితుడుగా ప్రచారం సాగుతోంది.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏం చెప్పారంటే…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. డబ్బులు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని చెప్పారన్నారు. ఫాం హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో వుంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కి చెందిన నందకుమార్ S/o శంకరప్ప ఇక్కడ వున్నారు. లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. పార్టీ ఫిరాయింపుల కోసం వత్తిడి, ప్రలోభాలు పెట్టారన్నారు.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్‌గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!