Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ వస్తువుల సరఫరా..!
- బిగ్ బాస్కెట్ గోదాములో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి
- కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ ఫుడ్ సరఫరా వెలుగులోకి
- లైసెన్స్ లేకుండానే అక్రమంగా నిర్వహణ
- కేసు నమోదు.. కఠిన చర్యలకు సిద్ధమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేస్తే నాణ్యమైన వస్తువులు ఇంటికి వస్తాయని నమ్మే వినియోగదారులకు రాజేంద్రనగర్ బిగ్ బాస్కెట్ (Big Basket) ఘటన ఒక కనువిప్పు. ప్రముఖ ఆన్లైన్ గ్రోసరీ సంస్థ బిగ్ బాస్కెట్ గోదాముపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్‌లోని బిగ్ బాస్కెట్ గోదాములో తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీ ఎత్తున నాసిరకం వస్తువులు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన మాంసాహారం (Non-Veg) పూర్తిగా పాడైపోయి, దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, గడువు ముగిసిన (Expired) ఆహార పదార్థాలను కూడా కొత్త వస్తువులతో కలిపి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
ఈ సోదాల్లో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, సదరు గోదాముకు ఉండాల్సిన ఫుడ్ లైసెన్స్ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కేవలం లాభాల కోసమే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
బిగ్ బాస్కెట్ సంస్థకు ఈ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న రాజేశ్వరి కంపెనీ పై పోలీసులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల అనంతరం నాసిరకం వస్తువులను సీజ్ చేసిన అధికారులు, నిబంధనలు అతిక్రమించినందుకు బిగ్ బాస్కెట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడే సామాన్యులు, వస్తువులను అందుకునేటప్పుడు వాటి నాణ్యతను , గడువు తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!