CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Devendra Fadnavis: బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ముంబైలో ఫుట్‌బాల్ ఆట ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు నేరుగా టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు ఆయన డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు అద్దాలు గుచ్చుకుని గాయాలవగా, గన్ పౌడర్ కారణంగా ఆయన చేతికి కాలిన గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన టైగర్.. డ్రైవర్‌ను పక్కకు జరిపి, స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముంబై పోలీసుల పనితీరును వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనను ముంబై పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించాయని, ఇప్పటికే కొందరిని గుర్తించామని స్పష్టం చేశారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. బెదిరింపులను ప్రభుత్వం ఎప్పుడూ తేలికగా తీసుకోదని, ముంబై పోలీసులు అత్యంత నిపుణులైన బలగమని కొనియాడారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అరెస్ట్ చేయడంలో ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్ర చూపామని, ఈ కేసులోనూ అదే పునరావృతమవుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
- Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
ఈ దాడికి సంబంధించి భద్రతా అంశాలపై వస్తున్న చర్చలపైనా ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనవసర చర్చలు అవసరం లేదని, ఘటన అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. భద్రత విషయానికి వస్తే.. గతంలో ఆయన రక్షణ కోరినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేరని, సరిగ్గా అదే సమయంలో ఈ దాడి జరిగిందని వివరించారు. ఇక, ఈ కుట్ర వెనుక తెరవెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఉగ్ర లేదా అసాంఘిక మూకల ఆఫీసులు మహారాష్ట్రలో లేవని, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నవారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ దాడులకు పాల్పడుతున్న వారు ఇతర రాష్ట్రాల నుంచి లేదా దేశం వెలుపల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వ సాయంతో పట్టుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దుండగులు కేవలం చాటుగా వచ్చి దాడి చేసే భయస్తులని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వీరి భరతం పడతామని స్పష్టం చేశారు. నిందితులు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకునే సత్తా ముంబై పోలీసులకు ఉందని మరోసారి నిరూపిస్తామన్నారు.
తాజావార్తలు
-
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
-
Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!