తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు..నిధులు కోసమేనని… కృష్ణ, గోదావరి నీళ్ళు వాడుకోవాలి అనే ఉద్యమాలు చేశామని తెలిపారు. పోతిరెడ్డి పాడు పాపం… కెసిఆర్ దేనని అని మండిపడ్డారు. Ntr ప్రారంభించినప్పుడు కెసిఆర్ మంత్రి అని… అప్పుడు కెసిఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. రెండు నదులపై కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదని… కృష్ణా నదిపై సంగమేశ్వర ప్రాజెక్టు ap కడుతుందన్నారు.
read more : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
ఈ ప్రభుత్వాన్ని మేము తన్ని లేపామని.. నాగార్జున సాగర్.. ఎండిపోతుంది అని కూడా చెప్పామని ఫైర్ అయ్యారు. మేము అరిచి గీ పెట్టినా నిద్ర లేవలేదని.. ఇప్పుడు లేచి అరుస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఇప్పుడు నిందలు వేస్తున్నారని..టీఆర్ఎస్ కు ప్రజల ప్రయోజనాల కంటే…ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యమని చురకలు అంటించారు. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడం కోసం కొట్లాడింది మా పార్టీ ఎమ్మెల్యేలేన్నారు. న్యాయం చేసి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను దోషి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి.