Bhatti Vikramarka : మహాత్మా గాంధీ ఏ పాపం చేశారని ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించారు
- యూపీఏ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఓ నిశ్శబ్ద విప్లవం
- మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని తిరిగి తెచ్చే వరకు కోట్లాది కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతాయి
- బలమైన బ్రిటిష్ పాలకులు గాంధీని ముట్టుకోలేకపోయారు
- కానీ దేశానికి చెందిన మతతత్వ శక్తులు ఆయన్ని కాల్చి చంపాయి : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. గురువారం సాయంత్రం చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం కనిపించకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, ఈ చట్టంలో మహాత్మా గాంధీని పేరు తొలగించడమే కాదు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్పులు చేసిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవి అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ దారుణమైన పరిస్థితులను పారద్రోలాలన్న మానవీయకోణంతో యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలో తీసుకువచ్చారని తెలిపారు. చిన్న రక్తపాతం, ఎలాంటి ఆందోళనలు లేకుండా కూలీలకు 100 రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ, ఉపాధి అనేది వ్యవసాయ కార్మికుల హక్కు అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని వర్ణించారు. ఈ గొప్ప పథకం వ్యవసాయ కార్మికుల జీవితాలకు ఓ అర్థం తీసుకువచ్చింది, ఉన్న ఊరిలోనే సంపాదిస్తూ ఆత్మగౌరవంతో వ్యవసాయ కూలీలు జీవించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం తోడ్పడిందని తెలిపారు. ఇంతటి గొప్ప పథకాన్ని కనుమరుగు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకువచ్చింది, చివరకు దేశ ప్రజలు మహాత్మునిగా పిలుచుకునే గాంధీ పేరును సైతం తొలగించిందని తెలిపారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఏ సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ల పిలుపుమేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కమిటీల ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005 ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన దేశంలోని కోట్లాది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు వ్యవసాయ కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. సామాన్యునికి ఇబ్బందులు వచ్చినప్పుడు తమిళనాడు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడుతుంది ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉపాధి చట్టంతో వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి ఇప్పుడు కూడా తమిళనాడు ముందు వరుసలో నిలబడి వ్యవసాయ కార్మికుల పక్షాన నిలబడటం అభినందనీయం అన్నారు. ఈరోజు చెన్నై నగరంలో జరుగుతున్న భారీ ర్యాలీని చూస్తే తనకు కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయని వివరించారు. ఈ దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ 1915లో ఆయన తన న్యాయవాద వృత్తిని వదిలి దేశానికి వచ్చారని గుర్తు చేశారు. అధికారం కోసమో? ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఈ దేశానికి రాలేదని తెలిపారు. తన సహచరులతో కలిసి దేశ స్వాతంత్రం కోసం గొప్ప పోరాటం నిర్వహించాలని పట్టుదలతో న్యాయవాద వృత్తిని వదిలేసి దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చారని తెలిపారు.
దారుణమైన బ్రిటిష్ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి కల్పించడానికి మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, సంపూర్ణ స్వరాజ్యం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఆయనతోపాటు అనేకమంది సీనియర్ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. వారి అద్భుతమైన, సాహసోపేతమైన పోరాటం మూలంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించడమే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశ కీర్తిని పొందింది అంటే బలమైన రాజ్యాంగమే కారణమని తెలిపారు.
1915 నుంచి 1947 వరకు మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి అయినప్పటికీ బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీజీని ముట్టుకునే సాహసం కూడా చేయలేక పోయిందని తెలిపారు. దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం సిద్ధించిన ఆరు నెలల్లోనే మన దేశానికి చెందిన మత శక్తులు మహాత్మా గాంధీని పట్టపగలు తుపాకీ గుళ్ళతో కాల్చి చంపాయి అన్నారు. బలమైన సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని ముట్టుకోలేకపోయింది కానీ మన దేశానికి చెందిన మతవాద శక్తులు మనమంతా మహాత్ముడిగా పిలుచుకునే గాంధీజీనీ చంపేశాయి అన్నారు.
గాంధీజీ మనకు స్వేచ్ఛను ఇచ్చారు, పెరియార్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు, కామరాజు నిజాయితీని ఇచ్చారు, అన్నా దురై మనకు గౌరవాన్ని ఇచ్చారు ఈ వరసత్వానికి తగిన భవిష్యత్తు ను మన బిడ్డలకు ఇవ్వాలి అదే కాంగ్రెస్ లక్ష్యం, నైతిక కర్తవ్యం, చారిత్రాత్మక బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. సభలో తమిళనాడు పిసిసి అధ్యక్షుడు సెల్వ, ఏ సి సి సెక్రటరీ చోలాంకర్ జి తదితరులు పాల్గొన్నారు.
Perni Nani: ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై పేర్ని నాని ఆగ్రహం
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!