Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌తో భారత్, పాకిస్థాన్ జట్లు శనివారం (అక్టోబర్ 3) గోల్డ్ మెడల్ కోసం తలపడుతున్నాయి. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉదయం 10 గంటల నుంచి ఈ హై-వోల్టేజ్ పోరు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే అందరి చూపు ఒక్క విషయంపైనే ఉంది. అదేంటంటే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ ఈ ఫైనల్ మ్యాచ్‌కి హాజరవుతారా లేదా అని! దీనికి ప్రధాన కారణం ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన టోర్నీల్లో ట్రోఫీ ప్రజెంటేషన్ సందర్భంగా తలెత్తిన వివాదాలే. అయితే ఈ ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. ఏసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) బాస్ అయిన మోహ్సిన్ నఖ్వీ ఈ ఫైనల్ పోరుకి దూరంగా ఉండనున్నారు. ముందుగానే ఖరారైన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల ఆయన ఏషియన్ గేమ్స్ ఫైనల్ డేకి హాజరుకావడం లేదని ఏసీసీ అధికారికంగా స్పష్టం చేసింది. ఇక గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ పడుతున్న నాలుగు జట్లకు నఖ్వీ శుభాకాంక్షలు తెలిపారు. తాను నాగోయాకు రాలేకపోతున్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో రగడ..
నిజానికి 2025 మెన్స్ ఆసియా కప్, 2026 ఉమెన్స్ ఆసియా కప్‌లలో భారత జట్లు విజేతలుగా నిలిచాక ట్రోఫీ ప్రజెంటేషన్ దగ్గర పెద్ద రగడే జరిగింది. మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. ఈ సమయంలో నఖ్వీ ట్రోఫీని దొంగలాగా తన రూమ్‌కి తీసుకెళ్లాడు. దాంతో ఆ రెండు టోర్నీల్లోనూ భారత జట్లు కప్ లేకుండానే వేడుకలు చేసుకున్నాయి. అందుకే ఈ ఏషియన్ గేమ్స్ ఫైనల్‌కి ఆయన వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఏసీసీ క్లారిటీ ఇవ్వడంతో నఖ్వీ వేడుకలకు రావడం లేదని తేలిపోయింది. ఇక టోర్నీ విషయానికి వస్తే.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌లు రద్దయినప్పటికీ, మెరుగైన సీడింగ్ ఉండటంతో రెండు జట్లూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. సెమీస్‌లో శ్రీలంకపై భారత్ సంచలన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 169/7 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి నాటౌట్‌గా 80 రన్స్ చేయగా, వైభవ్ సూర్యవంశీ కేవలం 21 బంతుల్లోనే 38 రన్స్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మన బౌలర్లు శ్రీలంకను కేవలం 45 పరుగులకే కుప్పకూల్చడంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలిచింది. వర్షం వల్ల 13 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 111/7 స్కోర్ చేయగా, పాక్ 11.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. 2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లో మన జట్టు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా రెండోసారి స్వర్ణం నెగ్గేందుకు టీమిండియా సిద్ధమైంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో మెన్స్ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌తో పాటు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వైభవ్ సూర్యవంశీ లాంటి పవర్ ప్యాక్డ్ ప్లేయర్లు ఉన్నారు. పాకిస్థాన్ జట్టుకు సాహిబ్జాదా ఫర్హాన్ నాయకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!