రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అపజయమేరుగని వీరుడిలా సినిమాలు చేస్తున్న వెట్రిమారన్, తన కథని రూటెడ్ గా ఉంచుతాడు, ఎర్త్లీ కనెక్షన్స్ ని మైంటైన్ చేస్తూనే సినిమా గ్రాఫ్ ని పెంచడంలో వెట్రిమారన్ దిట్ట. స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ సీన్స్, బ్లడ్ థంపింగ్ సీక్వెన్స్ లు వెట్రిమారన్ సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే విషయాలు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రమే. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, అందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి ఫేమ్ అండ్ క్రెడిబిలిటీ తెచ్చుకున్న వెట్రిమారన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
సోషల్ మీడియాలో వెట్రిమారన్ పేరు టాప్ ట్రెండ్ అవ్వడానికి కారణం ఒక్క ఫోటో. వడ చెన్నై సినిమాతో నటుడిగా మారిన డైరెక్టర్ అమీర్, వెట్రిమారన్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న వెట్రిమారన్… ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే కోసమే అమీర్ ని అప్రోచ్ అయ్యాడని కోలీవుడ్ టాక్. వడ చెన్నైలో అమీర్ ప్లే చేసిన సినిమాకే ప్రాణం పోసింది. ఇప్పుడు వాడివాసల్ సినిమాలో కూడా అమీర్ అలాంటి ఒక సాలిడ్ క్యారెక్టర్ ప్లే చేస్తే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. అయితే ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు, వెట్రిమారన్ విడుదలై పార్ట్ 2 రిలీజ్ పనిలో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాకే వెట్రిమారన్-సూర్య కలిసి వాడివాసల్ ని స్టార్ట్ చేస్తారు.