ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులలో నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోవాలని ప్రధానిని కోరారు రేవంత్ రెడ్డి. సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరియు వాటిని SCCLకి కేటాయించాలని అభ్యర్ధించారు. బొగ్గు విక్రయం కోసం బొగ్గు గనుల వేలం కోసం 3వ విడతలో సింగరేణి కాలరీస్‌లోని…
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని…