NTV Telugu Site icon

Bhatti Vikramarka: ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు. ఎన్ఎస్యూ ఐ నాయకులతో కలిసి సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో టిఎస్పీస్సీ బోర్డు చైర్మెన్, సభ్యులనే కాదు బోర్డును పూర్తీగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. సంబందించిన మంత్రులు రాజీనామా చేయాలన్నారు. వ్యక్తులు వ్యవస్థకు సమాధానం చెప్పాలని అన్నారు. భాద్యాతాయుమైన పదవుల్లో ఉన్న వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. జనం సమస్యలు బోలెడు ఉన్నాయని, ఏజెన్సీలో ఆదివాసుల బయటకు పంపించే కుట్ర దుర్మార్గమన్నారు. అడవిలో దొరికే సంపదను వారికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. అడవి పైన ఉన్న ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు క్షోభకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో జనం ఎన్నో సమస్యలు నాదృష్టికి తీసుకొస్తున్నారని అన్నారు. ద్వేషాలతో దేశాన్ని విడగొట్టుతున్నరని, సంపద కొంత మందికి పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు

ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రేవంత్, ఇటు నేను పాదయాత్ర చేస్తున్నామన్నారు. లక్ష్యం చేరుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వాలకు బుద్ది చెప్పుదామని పిలుపు నిచ్చారు. పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడ్డాం.. చివరకు అడవుల్లోకి రానియ్యాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి సంపదకు దూరం చేయడమే కాదు వారిని బయటకు పంపిస్తున్నారని మండిపడ్డారు. అటవీ సంపద అంతా వారిదే.. వద్దనడానికి నువ్వెవరు అంటూ నిప్పులుచెరిగారు. బ్రిటిష్ ప్రభుత్వం తరహా లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల విషయంలో అలాగె చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం తప్పా ఖానాపూర్ కు ఏ ప్రాజెక్ట్ రాలేదని, చేపల వేటకు వెళ్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఫ్రెంచ్, పోర్చు గిస్, బ్రిటిష్ ప్రభుత్వమా? వేరే దేశం ప్రభుత్వం అన్నట్లుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా కుండలు తీసుకోవడానికి మట్టి కూడా తీసుకోనివ్వడం లేదని, ఆదివాసుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని భట్టి పేర్కొన్నారు. గిరిజనేతరులకు ఏ సౌకర్యాలు లేవని, 42 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అని చెప్పారు.. కాని నీరు రావడం లేదు. దస్నాపుర్ అందుగూడలో చేద బావులు దిక్కు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ లు కట్టి బిల్లులు తీసుకున్నారని, అతి పెద్ద స్కాం మిషన్ భగీరథ అని ఆరోపించారు. లిక్కర్ స్కాం కు తెలంగాణకు సంబంధం ఏంటి? లిక్కర్ స్కాం ఉండి తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. క్రేజీ వాల్ నుంచి కవిత వరకు అందరి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు.
Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?

Show comments