NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: నేడు నిర్మల్ జిల్లాకు భట్టి విక్రమార్క.. షెడ్యూల్ ఇదే..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాల నిర్మల్‌కు రానున్నారు. భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ రానున్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పాల్గొననున్నారు. చివరి దశ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై ఆయన కీలక నేతలతో చర్చించనున్నారు. స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో మల్లు భట్టి మాట్లాడనున్నారు.

Read also: CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు భవిష్యత్తు ఉండదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. 400 సీట్లు ఎప్పుడు వస్తాయి? రాజ్యాంగాన్ని మార్చాలా, రిజర్వేషన్లు రద్దు చేయాలా అనే అంశంపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుందన్నారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే గొంతు కోసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. మంగళవారం గండీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నాయకులు బండ్ల గణేష్, సామ రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం వల్ల హక్కులు, వాటా దక్కని ప్రమాదం ఉందన్నారు. తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు రాలేదన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు మారడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లే కారణం.
Telangana IMD: వేసవిలో రికార్డు వర్షం.. హైదరాబాద్‌లో 3 గంటల వాన..

Show comments