Thummala Nageswara Rao: సీతారామ ప్రోజెక్ట్ కు సంబంధించి ఫస్ట్ పంపు హౌస్ ట్రయల్ రన్ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రెండు, మూడు పంపు హౌస్ లు చైనా నుంచి ఇంజనీర్ లు రావల్సి ఉందని అన్నారు. చైనా నుంచి ఇంజనీర్ లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రోజెక్ట్ కు గోదావరి జలాలు తరలింపు పూర్తి చేస్తామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రోజెక్ట్, లంకాసాగర్ సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటి నీ పంపిస్తామన్నారు. మోటార్ లు రన్ చేయకపోతే పంప్ లు చెడిపోతాయన్నారు.
Read also: Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
గోదావరి నుంచి కాలువలు 104 కిలోమీటర్ లు పూర్తి అయ్యాయన్నారు. యాతలకుంట పూర్తి అయితే సత్తుపల్లి, అశ్వారావుపేట లకు నీళ్లు వస్తాయని తెలిపారు. జూలూరుపాడు టన్నెల్, ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం వుందన్నారు. క్లియరెన్స్ పూర్తి అయ్యితే పాలేరు కు నీళ్లు వస్తాయని తెలిపారు. రూ.13500 కోట్ల ప్రాజెక్టు ఇది, రూ.7800 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఖర్చు పెట్టిన నిధులకు ప్రయోజనం కలుగాలన్నారు. నాగార్జున సాగర్ కు 3 లక్షలు, సీతారామకు 7 ఏడు లక్షల సాగు వస్తుందన్నారు. ఇల్లందుకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా చేస్తామన్నారు. 10 నియోజకవర్గాల్లో ఒక్కో దానికి లక్ష ఎకరాలకు సాగు నీటిని ఇస్తామన్నారు. సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాల తో నీటిని అందిస్తామని తెలిపారు.
Nagole: స్కూల్ ముందు విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన..