Nagole: ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేసి నాగోల్ లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద సంచలనంగా మారింది. తన పిల్లలకు టీసీ, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన వక్త్యం చేశాడు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్ లో చదివితే 6 ఏళ్లుగా బోనోపైడ్, టీసీ కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపించాడు. కాళ్ళు మొక్కిన కనికరించలేదని ధర్మరెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశాడు. ఇంత జరుగుతున్నా నాగోల్ లోని అక్షర టెక్నో స్కూల్ యాజమాన్యం స్పందించక పోవడం గమనార్హం.
Read also: Rat in Chutney: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక..
నాగోల్ లో నివాసం ఉంటున్న ధర్మరెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నాగోల్ లోని అక్షర టెక్నో స్కూల్ లో చేర్పించాడు. ఇందులో 6 ఏళ్లుగా వారిద్దరు పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. అయితే విద్యార్థి తండ్రికి ఫీజులు కట్టాలని యాజమాన్యం వత్తిడి పెరిగింది. అంత డబ్బులు ఇవ్వలేనని ధర్మరెడ్డి తేల్చి చెప్పాడు. అయితే రోజూ ఇద్దరు పిల్లల ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేయడంపై ధర్మరెడ్డి విసుగు చెందాడని విశ్వసనీయ సమాచారం. తన ఇద్దరి పిల్లల బోనోఫైడ్, టీసీ ఇచ్చేయాలని కోరాడు. యాజమాన్యం తన ఇద్దరి పిల్లల టీసీ, బోనోఫైడ్ లను ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇంత డబ్బులు కట్టలేని బోనోపైడ్, టీసీ ఇచ్చేస్తే తన స్తోమతకు తగ్గ స్కూల్ లో చేర్పించు చదివించుకుంటా అంటూ యాజమాన్యం కాళ్లవేళ్లా పడ్డారు. అయినా అక్షర టెక్నో స్కూల్ కనికరం చూపలేదు. దీంతో సహనం కోల్పోయిన ధర్మరెడ్డి న్యాయం చేయాలని కోరుతూ బోర్డు పట్టుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ..అక్షర టెక్నో స్కూల్ ముందు రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. అయితే ఇంత జరుగుతున్నా యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం గమనార్హం. దీనిపై పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు ధర్మరెడ్డి. మరి ధర్మరెడ్డి చేస్తున్న నిరసనకు పోలీసులు, స్కూల్ యాజమాన్యం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.