Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
- హైదరాబాద్ రోడ్లపై యువకుడి హల్చల్..
- రద్దీ రోడ్డు లపై వంద- 200 రూపాయలు నోట్లు చల్లుతూ హంగామా..
- రీల్స్ ల కోసం డబ్బులను రోడ్లమీద జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు..
- యువకుడు పై పోలీసులు కేసు నమోదు- గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Reels: సోషల్ మీడియాకు ప్రజలు బాగా అడిక్ట్ అయ్యారు. అందరూ రకరకాలుగా వీడియోలు తీస్తూ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడరు. అంతేకాదు ఇటీవలి కాలంలో యువత రీళ్ల మోజులో పడి ఏం చేస్తున్నామో మరిచి వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పబ్లిక్‌గా విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు రోడ్డుపై రొమాన్స్ చేస్తూ… ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువతి తుపాకీ పట్టుకుని నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. తాజాగా ఓ యువకుడు పబ్లిక్ రోడ్డుపై నోట్లను విసిరి వీరంగం సృష్టించాడు. దీంతో రోడ్డుపై డబ్బులకోసం ప్రజలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
హైదరాబాద్ రోడ్లపై యువకుడి హల్చల్ చేశాడు. రద్దీ రోడ్డు లపై వంద, 200 రూపాయలు నోట్లు చల్లుతూ హంగామా చేశాడు. తనను ఫాలో అయితే డబ్బులు ఎలా సంపాదిస్తాలో చెప్తానంటూ హల్చల్ చేస్తూ నడిరోడ్డుపై కనిపించాడు. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లి నోట్లను గాల్లోకి విసురుతూ చల్లుతూ హంగామా సృష్టించాడు. డబ్బులు రోడ్డుపై పడటంతో ప్రజలు వాటిని తీసుకునేందుకు నడిరోడ్డుపై పరుగులు పెట్టారు. ఆ యువకుడు చల్లిన నోట్లను తీసుకునేందుకు జనాలు ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ మరికొంత మంది జనాలకు, పోలీసులకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. చూస్తున్నట్లే రోడ్డుపై భారీగా జనాలు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రోడ్డుపై డబ్బులు ఏరుకుంటున్న జనాలను చూసి బిత్తరపోయారు. ఇదంతా ఓ యువకుడు తన రీల్స్ కోసం నడిరోడ్డుపై డబ్బులు చల్లాడని గుర్తించారు. అక్కడ ఆ యువకుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే దీనంతటి కారణమైన ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. అక్కడే వున్న సీసీ కెమెరాల సహాయంతో ఆ యువకుడిని కనుగునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణికులకు, పోలీసులకు ఆటంకం కలిగిస్తే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ యువకుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
BCCI Prize Money: 2024లో రూ.125 కోట్ల నజరానా.. 1983లో బీసీసీఐ ఎంత ఇచ్చిందో తెలుసా? అస్సలు ఊహించలేరు
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!