Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుపాకీ మోత మోగింది. మావోయిస్టులకి పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకి గాయాలైనట్టుగా సమాచారం. పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం సరిహద్దు అటువైపు ములుగు జిల్లా సరిహద్దు లో ఉన్న రఘునాథపల్లి దామెరతోగు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఈ తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టు దళం ఎదురు పడటంతో తెలంగాణ గ్రేహౌండ్ తలాలకి అదేవిధంగా మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు స్పష్టమైనది. ఇందులో ఒక దళ కమాండ్ ఉన్నట్లుగా చెప్తున్నారు .ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలైనట్లుగా చెప్తున్నారు. గాయపడినవారిని అదే విధంగా మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు సంఘటన స్థలాన్ని కి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షిస్తున్నారు.
Read also: Heavy Rain Alert: నేడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మరణించారు. దంతెవాడ జిల్లాలోని లోహగావ్‌లోని అండ్రి గ్రామం, పురంగెల్ అడవుల్లో 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలిని బలగాలు పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. ఇవి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ-2, సౌత్ బస్తర్‌కు చెందినవిగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్గన్, బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి.
The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?