Heavy Rain Alert: నేడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు
- తెలుగు రాష్ట్రాలు వర్షబీభత్సం తేరుకోకముందే మళ్లీ భారీ వర్షాలు..
- వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు భయాందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలు వర్షబీభత్సం తేరుకోకముందే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు (గురువారం) వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో వనగండం ఇంకా సమసిపోలేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షం భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు.
Read also: V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్ ఆఫర్..
Also Read
కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పెద్దగా కురవలేదు. కానీ, రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. రాత్రి ఒక్కసారిగా వాతావరణం ఊహించని విధంగా మారి కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపై నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్ప ఇంకెవ్వరూ మ్యాన్‌హోల్స్ తెరవకూడదని, ఇది చట్టరీత్యా నేరమని పేర్కొంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకకూడదని, ముఖ్యంగా చిన్న పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెప్పారు. పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని హెచ్చరింది.
CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!