Bhadrachalam: భద్రాచలం పట్టణంలో నిన్న పారామెడికల్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. కళాశాల చైర్మన్ పై విద్యార్థి సంఘాలు ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి ఈ నేపథ్యంలో కళాశాల వద్ద ఉధృత పరిస్థితి ఏర్పడింది. కళాశాల చైర్మన్ పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read also: Road Accident: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ కు చెందిన కారుణ్య అనే బాలిక భద్రాచలంలోని మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం నర్సింగ్ చదువుతుంది. కారుణ్య ఈరోజు తెల్లవారుజామున హాస్టల్ ప్రాంగణంలో అపస్మారక స్థితిలో అనుమానంగా పడి ఉండడంతో కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థినికి శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. చెవి, ముక్కులోంచి తీవ్రంగా రక్తస్రావం అవుతుందని తెలిపారు. మరోవైపు వైద్యులు ప్రకటించిన విషయాల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్ వార్డెన్ అసలు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి జారిపడిందని చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chhattisgarh : బీజాపూర్‌లో నక్సలైట్లపై దాడి.. 24 గంటల్లో ఎనిమిది మంది మృతి
కాలు జారి పడిన మనిషి ఇంత తీవ్రంగా గాయపడటం అంతే కాకుండా అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్ ను మెరుగైన చికిత్స కోసం తరలించకుండా పన్నెండు గంటల పాటు అరకొర వైద్యం అందించి, చివరకు కుటుంబ సభ్యులు తమ బిడ్డ ప్రాణంతో ఉన్నదా లేదా చూపించండి అని పోలీసుల సాక్షిగా ప్రశ్నించిన కొద్ది సేపటికే మృతి చెందిన విషయం ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో.. కారుణ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలనీ కోరుతున్నారు. కారుణ్య కాలుజారి కింద పడిందా, ఎవరైనా దాడి చేశారా, దాడి చేసి హాస్టల్లో పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కారుణ్యం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. కారుణ్య మృతి మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Ananya Nagalla : కర్ర సాముతో అదరగొడుతున్న అనన్య.. వీడియో వైరల్..