భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సాధారణంగా శిశువులు పుట్టినప్పుడు 2.5 నుండి 3 కేజీల బరువు ఉండటం సహజం. కానీ, ఇక్కడ ఒక మహిళ ఏకంగా 5 కేజీల 200 గ్రాముల బరువున్న ‘బాలభీముడికి’ జన్మనిచ్చింది. ఇంతటి భారీ బరువున్న శిశువు జన్మించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రసవం కోసం సంధ్యారాణి అనే గర్భిణీ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు శిశువు బరువు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవం చేయడం తల్లికి, బిడ్డకు కొంత రిస్క్‌తో కూడుకున్న పని అయినప్పటికీ, వైద్య బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది.
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?
వైద్యులు ఎంతో అప్రమత్తంగా ఉండి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 5.2 కేజీల బరువుతో పుట్టిన ఈ మగ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. తల్లి సంధ్యారాణి కూడా క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన కేసులను సమర్థవంతంగా డీల్ చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు , రోగి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన శిశువుకు ఎలాంటి అపాయం కలగకుండా డెలివరీ చేసిన వైద్యులను, సిబ్బందిని ఆసుపత్రి ఉన్నతాధికారులు అభినందించారు. మారుమూల ప్రాంతాల వారికి భద్రాచలం ఏరియా ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తోందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
