Tribal Attack: ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు 2022లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రు కొండ మండలం బెండలపాడు గ్రామ పరిధిలోని గుత్తి కోయలు నివసించే ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుని ఇద్దరు గొత్తికోయాలు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సంఘటన రాష్ట్రంలో సంచనలం కలిగించింది భద్రాద్రి జిల్లాలో పోడు వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ పరిధిలో పోడు భూములను స్వాదినం చేసుకొని అక్కడ ప్లాంటేషన్ నిర్మించారు. ప్లాంటేషన్ కొట్టడానికి వెళ్లిన గుత్తి కోయిలను ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అడ్డుకున్నాడు. దీంతో శ్రీనివాసరావుని ఇద్దరు గుత్తి కోయలు వేట కొడవల్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య ఘటన సంచలన కలిగించింది. మరోవైపున ఫారెస్ట్ సిబ్బంది తాము గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Karthikeya: ‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’…
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చింది. ఫారెస్ట్ సిబ్బందికి అన్ని రకాల అండదండలు ఉంటామని హామీలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి, వారిని జైలుకు పంపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కొత్తగూడెం కోర్టు ఈరోజు జీవితఖైదీ విధించింది. నిందితులు మడకం తులా, పొడియం నంగాకు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది నవంబర్ లో చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో రేంజర్ శ్రీనిసరావును వేటకొడవల్లతో గొత్తికోయ సమూహానికి చెందిన తులా, నంగా లు కిరాతకంగా దాడి చేయడంతో.. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల శ్రీనివాస్ రావు భార్యను కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహశీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే విధంగా 500 గజాల స్థలం కూడా ఇచ్చింది.
Double Bedroom: లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం