Site icon NTV Telugu

TPCC Mahesh Goud : రేవంత్ రెడ్డి నిర్ణయంతో మోడీనే పరేషాన్‌లో ఉన్నాడు

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ మహా ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం వల్ల కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి మోడీనే పరేషాన్‌లో ఉన్నాడని ఆయన అన్నారు.

మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “సహాసోపేత నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సపోర్ట్ చేయలేక, తిరస్కరించలేక మోడీ ముస్లింల అంశాన్ని ముందుకు తెస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు.

“రాహుల్ గాంధీ ఆశయానికి బీసీలు రుణపడి ఉండాలి. ఆయన కలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సైనికుడిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దేశంలోని ఓబీసీలంతా ఇప్పుడు రేవంత్ వైపు చూస్తున్నారు. రాహుల్ ఎప్పుడైనా మాట్లాడినా తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తారు,” అని చెప్పారు.

Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..

బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. “మన బాధ మోడీకి తెలియజేయడానికే ఈ ధర్నా చేస్తున్నాం. కేంద్రం బిల్లులను తొక్కిపెట్టింది. ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలంటే గవర్నర్ అడ్డుపడుతున్నారు,” అని ఆరోపించారు.

“కిషన్ రెడ్డి జీవితంలో ఏ పని చేసి గెలిచాడా? మేము పూజలు చేస్తాం కానీ దేవుళ్ల పేరు మీద ఓట్లు అడగం. చేతకాని దద్దమ్మలు దేవుళ్లను ముందు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. సికింద్రాబాద్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలడా? అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు తోకముడుస్తున్నారు?” అని ప్రశ్నించారు.

“బీసీలకు మద్దతుగా అన్ని వర్గాలు జంతర్ మంతర్‌కి తరలివచ్చాయి. ఓబీసీ రిజర్వేషన్లలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో నిలుస్తారు. మేము బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం. రిజర్వేషన్లు సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం. కాంగ్రెస్ అందరి పార్టీ. కేంద్రం దిగివచ్చి రిజర్వేషన్ల క్యాప్ తొలగించాల్సిందే,” అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.

Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!

Exit mobile version