Ponnam Prabhakar : తెలంగాణలో బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో మార్చి నెలలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మార్చి 22, 2025న బిల్లును గవర్నర్కు పంపించగా, గవర్నర్ మార్చి 30న బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4లను రాష్ట్రపతికి పంపినట్లు ఆయన వెల్లడించారు. జూలై 14న ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్కు పంపామని, గవర్నర్ నుండి సానుకూల నిర్ణయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీలకు పంచాయతీ యాక్ట్ ప్రకారం తగిన నిధులు అందడం లేదని మంత్రిప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. “రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్ పాస్ చేయించాలి” అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను బీసీ నాయకత్వం ఖండించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సహేతుకంగా ఉండడం లేదని ఆయన విమర్శించారు.
Telangana : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిల నియామకం
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్మెంట్ కోరుతున్నట్లు మంత్రిప్రభాకర్ తెలిపారు. “తెలంగాణ బీసీ నాయకులు ఈ కీలక సమయంలో ఢిల్లీలో పాల్గొనాలి,” అని పిలుపునిచ్చారు.
“50 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు స్వయంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని, ఇందిరా సహనీ కేసులో ఇదే స్పష్టం అయింది,” అని మంత్రి పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డిని ఉద్దేశించి “మీ పదవులకు ఇబ్బంది లేదు, మీ స్థానాల్లో మీరే ఉండండి” అని వ్యాఖ్యానించారు. ఆర్ కృష్ణయ్య మౌనం వహించకూడదని, ఆయన పార్టీ ఎంపీలను ఢిల్లీకి తీసుకురావాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రాజకీయ ఎదుగుదలకు ఈ బిసి రిజర్వేషన్ బిల్ ఎంతో ఉపయుక్తం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు అన్ని పార్టీల బిసి నేతలు తరలి రావాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.