CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరినా, రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు,” అని ఆయన విమర్శించారు.
Salman khan : సెట్‌లో నటిని బెదిరించిన సల్మాన్.. ఇంతలోనే ఎంటరైన మీడియా !
టెలంగాణలో కులగణన చేపట్టడం రాహుల్ గాంధీ సూచన మేరకే జరిగిందని రేవంత్ తెలిపారు. “రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం 42 శాతం బీసీ కోటా బిల్లు తెచ్చాం. ఈ కోటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం,” అని స్పష్టం చేశారు. కేంద్రం బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పార్టీలోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
