Bhatti Vikramarka: కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎనిమిది యేండ్ల అధాయం, అప్పులు కాళేశ్వరంలో ధార పోశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. వరదకు మొత్తం మునిగిపోయిందని మండిపడ్డారు. కట్టిన వాల్స్ కూలి పోయాయని, ఎనిమిది యేండ్ల సంపదను అప్పులు, నిరుపయోగంగా మారిపోయిందని విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Kgf మైన్ లోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళ ఫోన్ లు తీసుకున్నట్టు.. కాళేశ్వరంలో ఉద్యోగులను కూడా అలాగే చేస్తున్నారని బట్టి విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నారని ఎద్దేవ చేసారు. రాష్ట్ర అతలాకుతలం అవుతుందటే.. ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు పాలన ఉందా..? రాష్ట్రంలో అంటూ ప్రశ్నించారు.
read also:Harassment: మొన్న ప్రిన్సిపల్.. నేడు టీచర్.. కీచక బాగోతం
Also Read
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ సిఎల్పీ నేతగా విజిట్ చేస్తా అంటూ బట్టి అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే లంతా కలిసి వెళ్తామని తెలిపారు. అందరినీ అపినట్టు మమ్మల్ని ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వరద నష్టం ఎక్కువ జరిగిందని, రైతులు దెబ్బ తిన్నారని గుర్తు చేసారు. వెంటనే శాసన సభను సమావేశ పరచాలని డిమాండ్ చేసారు. వరదలు, నష్టం పై చర్చ చేద్దామని పిలుపు నిచ్చారు. రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన తో నేనని, అధిష్టానం మాట్లాడిందని స్పష్టం చేసారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తూ ఉన్నామని భట్టి స్పష్టం చేసారు. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం, మాట్లాడుతుందని, మేము మాట్లాడుతూ ఉన్నామని తెలిపారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటని రాజగోపాల్ ను అడుగుతున్నామని అన్నారు. తెలంగాణ లో టీఆర్‌ఎస్ ను ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి దీన్ని బాగు చేయడం ఎలా అనేది తెలుసని అన్నారు. కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని అన్నారు. నోటీసులు ఇవ్వడానికి భయం కాదు, మా పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కోసం తపన అంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.
Commonwealth Games: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన శ్రీహరి.. పతకం సాధిస్తే ఆ రికార్డ్ సొంతం
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!