Commonwealth Games: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన శ్రీహరి.. పతకం సాధిస్తే ఆ రికార్డ్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srihari Nataraj Books Final Berth In Men 100m Backstroke: బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీహరి నటరాజ్ (21) స్మిమ్మింగ్‌లో ఫైనల్స్‌కి దూసుకెళ్లాడు. సెమీస్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో అతను 54.55 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేశాడు. దీంతో అతడు తుది పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో తన హీట్స్‌లో నాలుగో స్థానంలో ముగించిన నటరాజ్.. మెడల్ ఈవెంట్ కోసం జరిగే ఫైనల్స్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ పీటర్ కోట్జ్ 53.67 సెకన్లతో సెమీస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం తుదిపోరు జరగనుంది.
బెంగళూరుకి చెందిన శ్రీహరి.. ఫైనల్స్‌లో పతకం సాధిస్తే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన రెండో భారత స్విమ్మర్‌గా చరిత్రపుటలకెక్కుతాడు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్విమ్మింగ్‌లో ప్రశాంత కర్మాకర్ కాంస్య పతకం నెగ్గాడు. ఆ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్‌లో ఏ భారతీయ అథ్లెట్ పతకం సాధించలేదు. అయితే.. శ్రీహరి ఫైనల్‌లో పతకం సాధించాలంటే, చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Also Read
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
సెమీస్‌లో అత్యుత్తమ టైమింగ్‌ని నమోదు చేసిన స్విమ్మర్లు ఉన్నారు కాబట్టి.. వాళ్లని అధిగమించేలా సత్తా చాటాలి. ఇప్పటివరకూ శ్రీహరి తన కెరీర్‌లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం 53.77 సెకన్లు. ఇప్పుడు సెమీస్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్న పీటర్ కోడ్జ్ సమయం 53.67 సెకన్లు. కాబట్టి.. శ్రీహరి తన టైమింగ్‌ని కాస్త మెరుగుపరుచుకుంటే.. పతకం నెగ్గడం తథ్యం.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!