బాసరలో అసలు ఏం జరుగుతోంది. ప్రతిసారి విద్యార్థులకు ఎదో ఒక సమస్య ఎందుకు ఎదురవుతోంది. నిజంగా ఇది విద్యార్థుల సమస్యేనా? లేక మరేదైననా? ప్రభుత్వం సమస్యలు తీరుస్తున్నా మళ్లీ ఎందుకు ఇలా సమస్యలు? విద్యార్థులకు సౌకర్యాలు ఎందుకు లేవు? త్రిబుల్ ఐటీ రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతిఒక్కరికి తలెత్తుతున్నాయి. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలున్నాయని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన కొన్ని నెలలుగా తలెత్తునే వున్నాయి.
సౌకర్యాలు కల్పించాలంటూ రాత్రి, పగలు అని తేడాలేకుండా వారి సమస్యలు తీర్చేంతవరకు విద్యార్థులు వర్షంలోనూ నిరసనలు, ధర్నాలు చేశారు. విద్యాశాఖ మంత్రి, పలునాయకులు త్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లి తీరుస్తామని చెప్పడంతో సమస్య సర్దుమనిగింది. అయితే మళ్లీ త్రిపుల్ ఐటీలో భోజన వసతులు బాగాలేవని, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడే వైద్యం అందించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. దీంతో విద్యార్థులకు ఫోన్‌లు అనుమతించలేదు. విద్యాసంస్థలో ఏం జరిగినా బయటకు వెళ్లకుండా భారీ పోలీసులు మోహరించారు. లోపల విషయాలు బయటకు, బయట విషయాలు లోనికి వెళ్లకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. తరువాత వంట షాలల్లోనే స్నానాల విషయంలో మళ్లీ వివాదంగా మారింది. ఆవిషయం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. త్రిబుల్ ఐటీలో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఇంటికి వెళ్లాడు కానీ విద్యాసంస్థలో భోజనం చేయడం వలనే మృతి చెందాడని విద్యార్థి కుటుంబ సభ్యులు త్రిపుల్‌ఐటీ గేటు వద్ద కూర్చొని నిరసన చేపట్టారు. దాంతో మరోమారు వార్తల్లోకి ఎక్కింది.
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. దీంతో.. ఇవాళ యూనివర్సిటీల బంద్ కు ఓయూ JAC పిలుపునిచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ మృతికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సురేశ్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
నిన్న హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ను కానీ, వైద్యాధికారులను కానీ పిలిపించలేదని మండిపడ్డారు. అధికారుల తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ చాంబర్ ముట్టడికి యత్నించారు. పక్కనే ఉన్న సీఐ వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Stotra Parayanam LIVE: చివరి శ్రావణ బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?