Banoth Rajendar Died With Cardiac Arrest During Police Selection Process: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు ఉద్యోగ నియమకాల్లో భాగంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఓ అభ్యర్థి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ములుగు జిల్లా పందికుంట శివారు శివతండా గ్రామానికి చెందిన బనోత్ రాజేందర్ (27).. ఈనెల 17వ తేదీన సర్టిఫికెట్ల పరీశీలన తర్వాత హనుమకొండ కేయూ మైదానంలో 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడు కార్డియాక్ అరెస్ట్‌తో కింద పడిపోయాడు. అక్కడున్న వైద్యులు కార్డియో పల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి, స్పృహలోకి తీసుకురాగలిగారు. ఆ వెంటనే అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Jai Shankar: సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదు
అయితే.. క్యాజువాలిటీలో మరోసారి రాజేందర్ కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. అప్పుడు వైద్యులు మరోసారి సీపీఆర్ చేసి, అతడ్ని రక్షించారు. రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ కావడంతో.. వైద్యులు రాజేందర్‌ను ఆర్ఎస్ఐసీయూ వార్డుకి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ.. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అతడు చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యులు అతడ్ని కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నించారు కానీ, రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ కావడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. అతని శరీరం వైద్యానికి సహకరించలేదు. పోలీసులు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా రాజేందర్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. రాజేందర్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.