సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి లేడని…టీఆర్ఎస్కు డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గెలవదని..వాళ్ళ పార్టీ నేతలను వాళ్లే కొనుక్కుంటున్నారని చురకలు అంటించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంలో టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
read also : డాక్టర్స్ డే : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన ఎంపి సంతోష్
తెలంగాణలో కేసీఆర్ ను కనుమరుగు చేస్తామని.. కేసీఆర్ ని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ గడిలా పాలనను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ అని.. ఎన్నికలు వస్తే హామీలు… తరువాత ఫార్మ్ హౌస్ లోకి పోయి కేసీఆర్ పడుకుంటాడని మండిపడ్డారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మోసమని… నోరు తెరిస్తే అబద్ధాలేనని ఫైర్ అయ్యారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తాడని… తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంట్ ని మరోసారి రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు..