Site icon NTV Telugu

Bandi Sanjay: కేసీఆర్ ఎవ‌రు? కోన్ కిస్కా.. బండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Bandi Sanjay

Bandi Sanjay

కేసీఆర్ ఎవరు కౌన్ కిస్కా.. అంటూ.. బండి సంజ‌య్ ఫైర్ అయ్యారు. న‌గ‌రంలో పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్‌ వీడ్కోలు పలికిన అనంత‌రం ఎయిర్‌పోర్టులో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని , బీజేపీ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌జ‌లే మాఅంద‌రికి బాస్‌లు అని సంజయ్‌ స్పష్టం చేశారు.

read also: KTR: త్వ‌ర‌లో అల్లూరి భవన నిర్మాణం

రాష్ట్ర ప్రజల వద్ద మొహం చెల్లక సీఎం కేసీఆర్ పారిపోతున్నారని విమర్శించారు. ప్ర‌ధాని మోదీని ఎదుర్కోవడానికి ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టిన డబ్బులు పెద ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నారు. నిన్న మోడీ సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జాతీయ కార్యవర్గ సమావేశాలను అంకితం చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతమయిందన్నారు. తెలంగాణ సీఎం తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Exit mobile version