Bandi Sanjay : ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.
సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా భారత్ కు తరలిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారతీయుల యోగ క్షేమాలకు ప్రధాని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో విదేశాంగ శాఖ ప్రతీ క్షణం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను వెనకీ తీసుకువచ్చే విషయం పైనే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విద్యార్థులతో పలు విమానాలు బయలు దేరాయని, మరిన్ని రాబోతున్నాయని ఆయన తెలిపారు. మాకు అందుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు తెలియ జేస్తున్నామని, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చాలా మంది తెలుగు విద్యార్థులతోను, ఇక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులతో నేను స్వయంగా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ నాయకులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వాళ్లలో భరోసా నింపుతున్నారన్నారు. విమానంలో విద్యార్థులు చేస్తున్న భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలు భారతీయుల్లో మరింత భరోసా నింపుతున్నాయన్నారు. ప్రయాణ ఖర్చుల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసిందని, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండని ఆయన ధైర్యం నింపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తుందని హామీ ఇచ్చారు.
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!