Bandi Sanjay: బండి సంజయ్ కౌంటర్ ఎటాక్.. కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Released KCR Jhoota Matala Posters: నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు అని ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. సీఎం కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లను విడుదల చేశారు. వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడాన్ని ఆ పోస్టర్లలో ఎండగట్టారు. ‘‘ఝూఠా మాటల కేసీఆర్… ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా’’ అంటూ ఆ పోస్టర్లను బండి సంజయ్ మంగళవారం నాడు మర్రిగూడలోని క్యాంప్ కార్యాలయంలో రిలీజ్ చేశారు.
ఇదే సమయంలో కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థఆయిలో విమర్శలు గుప్పించారు. మనుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి పచ్చి అబద్దాలు, మోసాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందకు సిద్ధమయ్యారని అన్నారు. మందు, మాంసం, డబ్బుతో ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మునుగోడు ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉన్న తరుణంలో.. కేసీఆర్ ఝూఠా మాటలు పోస్టర్లను ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ఆ పోస్టర్లలో బీజేపీ పొందుపరిచిన కేసీఆర్ ఝూఠా మాటలు కొన్ని..
1. ఒక దళిత నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేస్తా. తల నరుక్కుంటా కానీ, ఆ మాట తప్పను. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణకు దళిత నాయకుడే సీఎంగా ఉంటారు
2. దళితులకు మూడెకరాల భూమి ఇస్తా
3. 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తా
4. ప్రతీ మండలంలో అంబేద్కర్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
5. బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండవు
6. రైతులు పండించిన ఆఖరి గింజవరకు మేమే కొంటాం
7. తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మాటిస్తున్నా
8. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 ల నిరుద్యోగభృతి అందిస్తా
9. ప్రతీ సంవత్సరం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తాం
10. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తా
11. నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తా
12. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య తప్పకుండా అమలు చేస్తా
13. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ అందిస్తాం
14. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తా
15. పోడుభూముల సమస్య పరిష్కారానికి నేనే వస్తా
16. తెలంగాణలో ప్రతీ లంబాడీ తాండాలో, ప్రతీ గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్లు తెచ్చి.. ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతా
17. తెలంగాణ ఉద్యమకారులకే రాజకీయ అవకాశాలు కల్పిస్తా
18. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కుటుంబానికో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం
19. ట్యాంక్‌బండ్ వద్ద అమరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తా
20. ఉస్మానియా హాస్పిటల్‌ని కొన్నిరోజుల్లో షిఫ్ట్ చేస్తాం.. ఆ ప్లేస్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తాం
21. ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ కట్టిస్తా. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టిస్తా
22. తెలంగాణ ఏర్పడ్డాక అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవు
23. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసి, మంచినీటితో నింపేద్దాం
24. నిజాంషుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తా
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!