Fake certificate of death while alive: డబ్బు మనిషిని మార్చేస్తుంది ఇది ఎప్పుడు మనం వినే మాటలు. కానీ నేటి సమాజంలో ఆడబ్బు కోసం మనిషినే చంపేవరకు దారులు తీస్తున్నాయి. అయితే భూమికోసం కుటుంబసభ్యులు చేసిన ఓ ఘటన ఇప్పుడు ఆగ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.
Read also:Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ బతికి ఉండగానే చనిపోయిందని బంధువులు భూమి కాజేసే యత్నం చేశారు. దుర్గమ్మ పేరు మీద ఉన్న 1.20 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22న బాధిత మహిళ కాకినాడలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా బంధువు శ్రీ లక్ష్మీ ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. దుర్గమ్మ కూతురిగా శ్రీ లక్ష్మీ అన్ని రకాల డాక్యుమెంట్లు సృష్టించింది. ప్లాన్ ప్రకారం పట్టామార్పిడి కోసం స్లాట్ బుక్ చేసి 20 రోజుల క్రితం నర్సాపూర్ MRO ఆఫీస్ కి వచ్చింది. నిన్న మరోసారి ఎమ్మార్వో ఆఫీస్ కి దుర్గమ్మ బంధువు రావడంతో.. ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో అనుమానం చెందిన డెప్యూటీ తహశీల్దార్ నవీన్..ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ కావాలని డిమాండ్ చేశాడు. ఒరిజన్‌సర్టిఫికెట్ లేకుంటే పట్టా మార్పుడి చేయవా అంటూ డిప్యూటీ ఎమ్మార్వోతో శ్రీ లక్ష్మీ బంధువుల వాగ్వాదానికిదిగారు.
ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ తీసుకువస్తామని అక్కడినుంచి బంధువులు వెళ్లిపోయారు. అనుమానం వచ్చి తహశీల్దార్ విచారణ చేయించడంతో అసలు భాగోతం బట్టబయలైంది. విచారణలో దుర్గమ్మ బతికే ఉన్నట్టు నిర్దారణ కావడంతో ఒక్కసారిగా ఆఫీసర్లు షాక్ తిన్నారు. వెంటనే దుర్గమ్మను ఎమ్మార్వో ఆఫీస్ కి తహశీల్దార్ పిలిపించడండో దుర్గమ్మ అవాక్కైంది. నేను బతికుండగానే ఇంతపని చేశారా అంటూ నోరు వెల్లబెట్టింది. బాధితురాలు దుర్గమ్మ మాట్లాడుతూ.. నా భర్త కాకినాడలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, నా పేరు మీద అసైన్డ్ ల్యాండ్ పట్టా ఉందని తెలిపింది. ఆ భూమిని పట్టా చేయిస్తానని మా ఆడబిడ్డ కొడుకు మా భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లారని అన్నారు. నా దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపారు. ఆ డెత్ సర్టిఫికెట్ లో పేరు మార్చి నా భూమి కాజేసేందుకు ప్లాన్ వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Modern Haridasulu: హరిలో రంగ హరి.. మోడ్రన్ హరిదాసుల సందడి